లలితాదేవిని సహస్ర నామాలతో కొలుస్తాం .— అమ్మ వారి నామాల్లో అనన్యస్పూర్తి.


 

                         

                           లలితాదేవిని సహస్ర నామాలతో కొలుస్తాం. 
       వెయ్యి నామాలతో అమ్మవారిని పూజించడం వెనుక ఉన్నది కేవలం భక్తి భావమే కాదు… తరచి చూస్తే, ఆ నామాల్లో మహిళల ఔన్నత్యం, వాళ్ళకి ఉపయోగపడే అనేకాంశాలు కళ్ళకు కడతాయి                               
                                                              అమ్మ వారి నామాల్లో అనన్యస్పూర్తి  
              విద్యను ప్రసాదించే సరస్వతిగా, సంపదలను అందించే లక్ష్మీదేవిగా, శక్తి సామర్త్యాలను యిచ్చే పార్వతిగా ముగురమ్మల మూలపుటమ్మ అయిన లలితాదేవి సౄష్టిలోని ప్రతి మహిళలో  కొలువుదీరి    ఉంటుంది. అందువల్లనే ప్రతి మహిళలోనూ అనంతమైన ఈ విశేషాలు అంతర్లీనంగా కొలువుదీరి ఉంటాయి.
      అంతర్లీనంగా ఎంతో శక్తి:: 
          ప్రకౄతి గతమైన శక్తులు పంచభూతాల రూపంలో ఉన్నాయి.  అలాంటి ప్రకౄతికి మానవుడు  లోబడి ఉండవలసిందే.  కానీ అనతమైన శక్తి సామర్ధ్యాలు కలిగిన స్త్రీమూర్తి అవసరమైన వేళ ఆ ప్రకౄతినీ శాసించగలదు.
          లంకలో ఆంజనేయుడి తోకకు నిప్పు అంటించినప్పుడు సీతాదేవి అతనికి బాధ చల్లగా అయిపోవుగాక అని శాసించింది. అగ్ని దేవుడు ఆ ఆజ్ఞను శిరసావహించాడు.
          భర్త ప్రాణాలను రక్షించు కొనే నిమిత్తం సతీ సుమతి సూర్యోదయం కాకుండా నిలువరించగలిగింది.
          సకల జీవుల ప్రాణాలనూ హరించే యముణ్ని సైతం ధిక్కరించి మంగళ్యాన్ని నిలుపుగోగలిగింది సతీ సావిత్రి. 
          పరికించి చూస్తే, నేటి సమాజంలో కూడా భర్త కోసమో, పిల్లల కోసమో తన అంతర్గత శక్తులను వినియోగించి అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్న మహిళా మణులెందరో కనిపిస్తారు. 

      సందర్భాన్నిబట్టి స్పందించాలి::

 

 

          జగన్మాత శుంభునిశుంభు రాక్షసులకు అనుకూలవతి గా ఉన్నట్లు నటించింది.  కానీ లోక కంటకులైన వాళ్లిద్దరినీ సం హరించింది. ఉద్యోగ నిర్వహణలో, బంధుమిత్రులతో, ఇరుగుపొరుగు

 

          వారితో తగు మాత్రపు చనువుండేలా చూసుకోవాలి. వాళ్లు దాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పుడు నిర్భయంగా అడ్డుకట్ట వేయాలి.

 

        అవగాహనతో అలంకరణ:
 

 

          లలితాదేవికి తెలిసిన సౌందర్యం లోకంలో మరెవరికీ తెలియదు.స్త్రీ తన శరీరంలో నలభైఏడు స్తానాల్లో అలంకరించుకోవచ్చని ఆ జగన్మాత నిరూపిస్తుంది. 

 

          తలమీద ధరించే కిరీతమ్నుంచి కాలికి పెట్టుకొనే ఆభరణం వరకు ఏ ఏ భాగాల్లో ఏవి అలంకరించుకొంటే బాగుంటుందో అమ్మవారిని చూసి తెలుసుకోవచ్చు. 

 

          చేతికి గాజులు ధరించి అవి అటూఇటూ కదిలినప్పుడు మణికట్టుకురాపిడి కలగాలి.  ఇది సంతాన ప్రాప్తికి దోహదం చేసే అంశంగా ఉపయోగపడుతుందని లలితా సహస్రం తెలియజేస్తుంది. 

 

    

 

          చంపకాశోక పున్నగ, సౌగంధిక లసత్కచా… అంటే లలితాదేవి చంక, అశోక, పున్నగ, సంపెంగ వంటి సువాసనలిచ్చే పువ్వుల్ని అలంకరిచుకుంటుంది. 

 

          అశోక పువ్వు జుట్టులోని ఓత్తుదనాన్ని తగ్గించదు. పున్నగ క్రిములూ, కీటకాలను దూరంచేస్తుంది. 

 

          ఇలా సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శ్లోకాలు తెలియజేస్తాయి. 

 

           పూలు పెట్టుకోవడం, సహజ ఉత్పత్తులతో అలంకరణ చేసుకోవడం అనుసరణీయమని సూచిస్తాయి.
        
              పసిడికాంతులకు ఓటు::

          తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా… ఆకాశం  లోని నక్షత్ర కాంతి కన్నా దుర్గామాత ధరించే ముక్కుపుడక,  నత్తు. ఈ రెండింటికే ఎక్కువ కాంతి అని దానర్ధం.
          నాసికకు బంగారు నగలు ధరించడం వల్ల శ్వాస తీసుకునేప్పుడు ఇబ్బందులు ఉండవు.
          అలాగే పసిడి చర్మానికి తగలడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. 
          దానికి ఒత్తిడిని నివారించే శక్థి ఉంటుంది. అందుకే వివహితురాలైన స్త్రీ మంగళసూత్రం ధరించాలంటారు.
 
       ఇద్దరిదీ ఒకే మాటగా:::
          వేయి నామాల్లో నీకు ఏది అత్యంత ప్రీతిపాత్రం అని శంకరుడు పార్వతీదేవినడిగితే అమ్మవారు వెంటనే ‘కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కంధరా…’  అంటూ బదులిస్తుంది. 
         అమ్మవారికి భర్తను ఎలా మంచి చేసుకోవాలో తెలుసు. 
         అందుకే తనకు ఇష్టమైన ఆభరణం మెడలోని మాంగళ్య మని సమాధాన మిచ్చింది. మాట్లాడే తీరుకి ఎప్పుడూ మంచి మార్కులుంటాయి. 
         ముఖ్యంగా భర్తతో మాట్లాదే తీరు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. శంకరుడు, పార్వతి ఒకే దేహంలో చెరిసగం. 
          అందువల్ల ఆలోచన నుంచి ఆచరణ దాకా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. సంసారం నిలబడాలంటే ఇదే సాధనం.
 
          ఆరోగ్య సూచనలూ అందులోనే :::

           గర్భం దాల్చి నవమాసాలు సజావుగా సాగి, పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలంటే… స్త్రీ కొన్ని రకాల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
          ‘పాయసాన్న ప్రియా’ అంటే మొదటి నెలలో పాయసాన్నం తీసుకోవాలి. వదనద్వయసమ్యుత… స్నిగౌధోదన ప్రియా… రెండో నెలలో నేతితో తడిపిన అన్నం తినాలి.
           మూడో నెల్లో గూడాన్న ప్రీత మానసా… బెల్లపు అన్నం తినాలి.  నాలుగో నెల్లో దధ్యన్నా సక్త హృదయా… పెరుగన్నం, ఐదో నెల్లో ముద్గౌదన సక్తచిత్తా… అంటే పులగం,
           ఆరోనెల్లో హరిద్రాన్నైక రసికా…  పులిహొర,  ఏడో నెల వచ్చేసరికి తీసుకునే ఆహారం మోతాదు పెంచాలి. సర్వౌదన ప్రీత చిత్తా… అన్నీ తలో ముద్ద తినాలి. అప్పుడే ఆరొగ్యం.
 
          ఓర్పూ… నేర్పూ...
            ఇల్లలిగా మహిళ నిర్వహించే బాధ్యత ఎంతో విలువైనది. హరనేత్రాగ్ని సందిగ్ద కామ సంజీవనౌషద్ది అని లలిత సహస్రనామంలో శంకరుడు మన్మధుడిని మసి చేయడం గురించి చెప్పబడింది.
            భర్త చేసిన దాన్ని పార్వతి నలుగురిలో చులకన చేయలేదు. అలాగని సాటి మహిళ రతీదేవిని వితంతువుగా చూడాలనుకోలేదు.
            అందుకే చాకచక్యంగా సమస్యను పరిష్కరించింది. కేవలం రతీదేవికి మాత్రమే మన్మధుఢు కనిపించేలా చేసింది.
            దుర్యోధనుడి విషయానికి వద్దాం. అమ్మవారి వద్దకెల్లి పూజించినప్పుడు ‘యతో ధర్మ:, తతో జయ:’ అని దీవిస్తుంది. 
            ధర్మం ఉన్నవైపే విజయం అని పరోక్షంగా తెలియజేస్తుంది. పిల్లాడి పరిజ్ఞానం తల్లికి తెలుస్తుంది.
            అయినా బాగా చవిది, పరీక్షలు రాయి అంటుంది. కానీమాటలతో నిరుత్సాహపరచదు.  

 

 

Advertisements
This entry was posted in categorised. Bookmark the permalink.

3 Responses to లలితాదేవిని సహస్ర నామాలతో కొలుస్తాం .— అమ్మ వారి నామాల్లో అనన్యస్పూర్తి.

 1. I am not able to read this one, but I love to see that you are bringing your thoughts and your spirit onto this blog regularly… With Joy, Peace and Happiness! Tomas

  • lvsrao says:

   Thank you.
   I shall soon give this posting English version.
   Once again thank you for your interest and going through my blog regularly.
   With all veneration,
   lvsrao.

  • lvsrao says:

   Thank you very much.
   I shall soon give the English version for this one.
   Once again I express my thanks for your interest and going through my blog regularly.
   With veneration,
   lvsrao.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s