కుటుంబమే గురుకులం తల్లిదండ్రులే గురువులు తరతరాల అసలు సిసలు జీవనకదంబం.


 

 కుటుంబమే గురుకులం   తల్లిదండ్రులే గురువులు

                                                తరతరాల అసలు సిసలు జీవనకదంబం.

      చెరిగిపోని జ్ణాపకాలు:: 

       అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంతుంటే నాన్న గుండెలపై బుడి బుడి అడుగులు వేయటం ఒక తియ్యని జ్ణాపకం. నాన్న చాతీ అంతర్జాతీయ ఆటస్థలం  (international play ground) కంటే విశాలం అనిపించేదేమో!    గుండెలపై అడుగులు వేసేవారమో, నడిచేవారమో — నాన్నకు నొప్పి కలుగునేమో తెలియదు. కారణం అప్పటికి ఆలోచనా జీవులం కాలేదు. యెంతెలా గుండెలపై ఎగిరి గంతులేస్తున్నా, బాధనిపించినా మా కేరింతలతో నాన్న శౄతి కలపటం ఒక మధురమైన చెరిగి పోని జ్ణాపకం.  అడుగులు తడబడుతుంటే నడక నేర్పింది నాన్న.   నాలుగు అడుగులకే పాదాలు కందిపోతుంటే భుజాల కెత్తుకున్నది నాన్న. పాలు త్రాగటం నేర్పింది అమ్మ. పాల బుగ్గలు కందకుండా  చూసుకున్నది అమ్మ. కమ్మటి కధలతో, పాటలతో జోకొట్టి కలలోకి-నిద్రలోకి సాగనంపింది అమ్మ. 
       అక్షరాలు దిద్దించి అక్షయంగా ప్రపంచంలోకి పంపింది నాన్న. ఆ అమ్మ నాన్నల నడకలలో  నడుస్తూనే  ఇంటివారం అయ్యాము. ఇంతై ఇంతింతై ఎంతటివారమో అయ్యాము. అమ్మకు మించిన అమ్మ లేదు, నాన్నను  మించిన గురువు లేడు. అమ్మతోనే ఆత్మీయ ప్రపంచము రంగులు దిద్దుకుంటుంది.   నాన్న దిద్దించిన అక్షరాలతోనే ప్రపంచం తలుపులు తెరుచుకుంటాయి. మన వ్యక్తిత్వ వికాసంలో, నడవడిక తయారు (character building)  లోతండ్రి తొలిగురువు. తండ్రి తర్వాతే తక్కిన ప్రాపంచిక వ్యక్తిత్వాల ప్రభావం. అందుకే, తండ్రి వంద మంది  పాఠశాల గురువులకంటే ఎక్కువ (more than hundred school teachers) అంటుంటారు. ఇంట నున్న గురువును కాదనుకుని ప్రాపంచికంగా ఎంత పరుగులు పెట్టినా, ఎందరు గురువుల్ని ఆశ్రయించినా నిరంతర మౌన ప్రభావం తండ్రిదే! ప్రపంచదేశాల్ని తిరిగివచ్చి తండ్రి సమక్షంలో నిలబడితే మౌనంగా కొత్తసందేశం వినిపిస్తూనే వుంటుంది. తండ్రి ఒడిలో అక్షరా భ్యాసన చేస్తే ప్రపంచంలో అక్షర సన్యాసం చేయాల్సిన అవసరం రాదు.  తన పిల్లలు తనను మించిన వారు కావాలని తండ్రి అనుకుంటుంటే, ఏ పని చేసినా తండ్రి మెప్పు పొందాలని పిల్లలు అనుకుంటుంటారు. ఇదీ జీవన గమనం.  
   నాన్న నీడనుంచి తప్పుకోవాలి:: 

        తండ్రి గురువే! ఓనమాలు దిద్దించింది నాన్నే! నడక నేర్పిందీ నాన్నే! ప్రపంచాన్ని జయించు అని ఆశీర్వదించిందీ నాన్నే! ఎండపొడ తగలకుండా గొడుగు పట్టిందీ నాన్నే! గొడుగు పట్టడం తండ్రి కర్త్తవ్యం అయితే గొడుగు క్రిందకు చేరడం పిల్లల వ్యక్తిత్వం. ఇటువంటి వ్యక్త్తిత్వం మొదటి 5/6 సంవత్స్తరాలు వరకూ వుంటుంది. బడికి ఒంటరిగా వెల్లటం ప్రారంభం అయ్యేటప్పటికి తనవైన ఆలోచనలు ప్రారంభమవుతాయి. తనదైన వ్యక్తిత్వానికి రూపకల్పన ప్రారంభమవుతుంది. అప్పటినుంచి గొడుగుకిందనే యుండి పోవాలని పిల్లలూ అనుకోరు, ఉండాలని తండ్రీ ఆశించ కూడదు.  నీడను జరపాలని పిల్లలు ప్రయత్నించకూడదు. అవసరం మేరకే పిల్లలు తండ్రి పంచన చేరాలి. ప్రపంచం పెద్దది కాబట్టి ఆ చూరునుంచి జరిగి నడక ప్రారంభించాలి. నడక నలుగురితో అయినపుడు నీదైన ముద్ర ఉండాలి. నీ నడక నీది కావాలి. మరొకరిలా అనుకరిస్తే నీ కంటూ గుర్తింపు ఉందదు. అనుకరణ లేనిచోటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అనుకరిస్తున్నంతకాలం ఆత్మ న్యూనత వెన్నంటు తుంటుది. ఏ తండ్రి అయినా తన పిల్లల విషయం లో ఇలా విశిష్ట వ్యక్తులు కావాలని ఆశిస్తాడు. అందుకే పదహారేళ్ళ ప్రాయానికివచ్చిన పిల్లలు తన నుంచి విడి వడటాన్ని తండ్రి మోనంగా గమనిస్తుంటాడే తప్ప ఏ నాడు అడ్డుపడడు. జాగ్రత్తలు చెబుతుంటే కుర్ర వయసు కన్నెర్ర చేసినా తండ్రి ఆ కన్నెర్ర లో పిల్లల కనువిప్పును చూస్తుంటాడు.

          ప్రతీ తండ్రి తన వ్యక్తిత్వ వారసత్వాన్ని కోరుకుంటాడు. తన వ్యక్తిత్వాన్ని తన పిల్లల్లో  చూడాలనుకుంటాడు. ఎదుగుతున్న పిల్లల్లో తన వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ వారి ఎదుగుదలకు తానే ఒక కొండలా అడ్డు తగలడం ఇష్టముండదు. నిజానికి అంత పెద్ద కొండా పిల్లల విషయం లో  కొంచమైపోతుంటుంది. లేదా ఒదిగి వారి ప్రయాణం నిరాటంకంకంగా సాగేలా సహకరిస్తుది. పిల్లల ప్రయాణం తన దగ్గరే ప్రారంభమైనా లక్ష్యం సైతం తానే కవాలని ఏ తండ్రి కోరుకోడు. పిల్లలు గమ్యం చేరే విషయంలో గమనంలో తొలి అడుగులు వేయటంలో తానే గురువు అయినప్పటికీ గురుత్వం అంతవరకే. మలి అడుగులు పరిగెత్తగల వారివే!  గమనిస్తూ అడుగులు వేయాలి. అడుగులు వేస్తూ పరుగు లంకించుకోవాలి. ఎంత పరుగెత్తినా అడుగు తీసి అడుగు వేయాల్సిందే! తొలి అడుగును కాదని మలి అడుగు పడదు కదా! తండ్రిని తొలి గురువుగా పరిగణించలేని  వారు ప్రపంచములో ఏ ఒక్కరినీ గురువుగా పరిగణించ లేరు. అందుకే పిల్లల విషయం లో తండ్రిది డబుల్ రోల్ అవుతుంది.
                    
తండ్రి ఎప్పటికీ విమర్శకుడే::
              నీ అడుగులు తడబడుతున్నప్పుడు తండ్రి మౌన ప్రేక్షకుడిలా వ్యవహరించి యుండవచ్చు. ఆ మౌనము నీకు ఆత్మస్తైర్యాన్ని కలిగించటానికే. అయితే అనుకరణ మాని నీదైన నడక ప్రారంభ మైననాడు నీ తండ్రి ఒక విమర్శకుడు అవుతాడు. నీ తప్పొప్పుల్ని ఎత్తి చూపే వాడవుతాడు.   ఈ విమర్శన “జాగ్రత్త/శ్రద్ధ” (this criticism “caring”) ధృక్పద్ధం తోనే తప్ప నిన్ను కించపరచడానికి కాదు. తండ్రికి యున్న వికసించిన మనస్సు (open mind) పిల్లలకు లేక పోతే ఎలా? నీలో బలహీనతలు పోవాలంటే ఆమాత్రం జీవన పాఠాలు వినాల్సిందే! ఎదుగుతూ నువ్విచ్చే సమధానాలను బేరీజు చేయగలిగింది ఆయనే! తండ్రి వేసే మార్కులు పిల్లలకు ఎంతో విలువైనవి. పిల్లల జీవితాలకు ఎంతో అర్ధవంతమైనవి. అంతమాత్రాన పిల్లలు తండ్రిని అనుకరించాలని కాదు.
              నువ్వు వేసే ప్రతీ అడుగులోనూ నీ ముద్ర ఉండాలి. ప్రతీ మలుపులోనూ నీ సంతకం కనిపించాలి. అంత మాత్రాన తండ్రితో పోటీపడినట్లుకాదు. అసలు తండ్రి జాగ్రత్తలో ఉన్నావను కోవటమే కొండంతబలం. తండ్రి కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన అది తండ్రి వశము (controlling) అనుకుంటే  ఎలా? తండ్రి అంశ నీకు సహజకవచం. ఎవరో తగిలిస్తే తగిలించు కున్నది కాదు. పిల్లల దౄష్టిలో తండ్రి ఎప్పటికీ ప్రపంచాన్ని జయించిన వాడిగా మిగిలి పోవాలి. కారణం తండ్రి దాటుకుంటూ వచ్చిన ఎత్తు పల్లాలన్నీ పిల్లల క్షేమం కోసమే.   అలా తానుదాటుకుంటూవచ్చి తన అనుభవంతో పిల్లల్ని దాటించి విజయులుగా / సాధించినవాల్లగా (achieversగా) చేయడమే తండ్రి చేసేపని.అలా తండ్రిది స్వార్ద్ధ్రహితమైన ఆచరన (selfless affect). అంటే పిల్లల విషయములో తండ్రి ఎప్పటికీ నిస్వార్ద్ధజీవి. 

          ఆకాశమంత ఎత్తు కంటే  ఔదార్యము మహత్వము గలవాడు తండ్రి.

                (Father is Grandeur than the heights of the Sky) 

            భూమాత మహత్వము కంటే ఉత్కౄష్టమైన ఉదారతగలది తల్లి.

                             
                   (Mother is Greater than even the Majesty of the Earth)
                               
కనిపించని తరాల తీరాలు::
            తండ్రీ పిల్లల అన్నొన్యతల మధ్య తల్లి సైతం మౌన వ్రతం పాటించవలసి వస్తుంది. ఇతరాలేవీ ఆ అనుబంధంలో చొరబడలేవు.ప్రపంచములోకి నడిపించింది తల్లిదండ్రులే. అయినా వౄత్తిరీత్యా పిల్లలు ప్రపంచంలోని ఏ మూలనైనా యుండవచ్చు. పెద్దలు ఉన్న చోటునుంచి కదలక పోవచ్చు. అయినా వారి మధ్య ఉన్న దూరాన్ని భౌతికము (physical) గా కొలవగలమేమోగాని మానసికము (emotional) గా వారి సాన్నిహిత్యాన్ని తూయటానికి ఏ కొలమానాలు సరిపోవు. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, తల్లిదండ్రులు పిల్లల సమీ పములో లేకపోయినా అది  భౌతికము (physical) గానే తప్ప బంధాలు తెంచుకొని కాదు.    అనురాగాలు కాదనుకొని కాదు. ఇందు లో ఏది జరిగినా అది తమ చేతులారా చేసుకున్నది అవుతుందే తప్ప మరి ఏ ప్రమేయంతో కాదు. ప్రమేయం అంటే చిన్నప్పుడు చదువుకున్న ఓ బుల్లి కధ గుర్తొస్తుంది. చీమా, చీమా ఎందుకు కుట్టావ్ అంటే, “నా బంగారు పుట్టలో వేలెడితే కుట్టనా” అందట.  ఇలా పెద్దలకైనా, పిల్లలకైన తమదైన బంగారు ప్రపంచం ఉంటుంది. ఒకరి ప్రపంచం లోకి మరొకరు ప్రవేసించాలి అనుకోవటంతో అహంకరాలు  అడ్డొస్తుంటాయి. ఆప్యాయతలు కరువవుతుంటాయి. పిల్లల గుప్తత (privacy) పిల్లలది. పెద్దల పరిధి పెద్దలది. రెండు తరాలకు మధ్య కనిపించని తీరాలు ఉంటాయి. ఒకతరం తమ తీరందాటి రెండో తరంలోకి చొచ్చుకుపోతుంటే సుడిగుండాలు తగలవు సునామీలు ఏర్పడుతుంటాయి.  తీరం దాటకుండా ఎంత ఎత్తుకు ఎగిసిపడ్డా నష్టం ఉండదు. ఎగసి మరో తీరంలోకి ఎగిసి పడ్డా తుఫాను అలజడి   మిగులుతుంది.
                     

  తమపరిధిని తాము చూసుకుంటూ పెద్దల ఆంతర్యాన్ని అర్ధం చేసుకుని ప్రాభావితమవడము పిల్లల కర్తవ్యము.

                                                             ఈనాటి  పిల్లలు ఒకనాటికి  పెద్దలే – తల్లిదండ్రులే.

 

 

 

 

 

 

Advertisements
This entry was posted in categorised. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s